అది జరగదు - ఒక నిశ్శబ్ద పోరాటం
ప్రతి బంధంలో ఇద్దరు మనుషులు ఉంటారు. కానీ, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటే? ఒకరు తన కోసం జీవించాలనుకుంటే, మరొకరు తనను అర్థం చేసుకోమంటే? ఇద్దరి మధ్య నలిగిపోయిన ఒక మనసు, చెప్పలేక మిగిలిపోయిన ఒక కథ. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి గొడవలో ఉన్నారా? ఈ కథ చదివాక మీకు సమాధానం దొరుకుతుంది.
అది జరగదు 1
అతడు
: నేను రానా స్టేషన్ కి
5 నిమిషాలు ట్రైన్ ఆగుతుంది కదా
ఆమె
: అంటే అది నేను ఫ్యామిలీ
అందరితో వచ్చాను
అతడు
: ఫ్రెండ్ అని చెప్పు ప్రసాదం
ఇస్తా అని చెప్పి రమ్మన్న
అని చెప్పు
ఆమె
: అలా అని కాదు నేను
నా ఫ్రెండ్ ని రమ్మన్నా నిజంగా
తను ప్రసాదం అడిగాడు , నువ్వు వస్తే నీతో మాట్లాడాలి తను
చాలా బిజీ ఉన్నాడు అయినా
కలవడానికి వస్తున్నాడు , మనం రోజు మాట్లాడతం
కదా
అతడు
: ఎవరు ఫ్రెండ్స్ ల ఉంటూ ఇద్దరు
ఫ్లిర్ట్ చేసుకోవచ్చు అని మీరు మాట్లాడుకుంటారు
వాడేనా
ఆమె
: అయ్యో అతను కాదు వీడు
నా బెస్ట్ ఫ్రెండ్ వాడు నార్మల్ ఫ్రెండ్
, మళ్ళా నిన్ను చూస్తే 100 ప్రశ్నలు అడుగుతాడు
అతడు
: ఏది ఐతే నిన్ను చూడానికి
నేను రావొద్దు పోనీ దూరం నుంచి
చూసి వెళ్ళిపోతా
ఆమె
: నేను హర్ట్ అవుతా అబ్బా వద్దు అలా , నువ్వు నీ వర్క్ చేసుకో
నేను ప్రశాంతంగా నీకోసం వస్తాను డే అంత ఉంటాను
నీతో సరేనా
అది జరగదు 2:
ఆమె
: మేము కుటుంబం అంతా మైసూరు వెళ్తున్నాం
రెండు రోజుల్లో
అతడు
: ఎలా వెళ్తున్నారు
ఆమె
: ట్రైన్ లో
అతడు
: నేను వస్తాను కదా
ఆమె
: టికెట్స్ ఎప్పుడో బుక్ అయ్యాయి కదా
అతడు
: నేను తత్కాల్ బుక్ చేసుకుని వస్తాను
, దూరం నుంచి నిన్ను చూసుకుంటా
ఆమె
: నాకు అలా ఇష్టం లేదు
మనం వెళ్దాం ఒకరోజు ఇలా నన్ను ఇబ్బంది
పెట్టకు
అతడు
: సరే ఆ రాహుల్ మనకోసం
తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు బ్లాక్ చేసేయచ్చు కదా
ఆమె
: అలా ఎలా చేస్తాం ఎవరో
చెప్పింది విని మాట్లాడాడు , నేను
అలా ఎవరి బ్లాక్ చేయలేను
అతడు
: నన్ను చేశావ్ కదా అన్ని టాగ్స్
పోయయీ కూడా
ఆమె
: ఏదో కోపం లో చేశాను
అతడు
: సరే కొంచెం పని ఉంది మళ్ళా
మాట్లాడతా
అది జరగదు 3:
అతడు : హలో
ఆమె : కోపం
తగ్గిందా బేబీ
అతడు : అదేం
లేదు ఏదో పిక్ పెట్టావ్
ఆమె : హా ఎలా
ఉంది
అతడు : బాగున్నావు
వెనక నుంచి కూడా
ఆమె : అంతేనా
అతడు : ఏంటి
అర్థం కాలేదు
ఆమె : అంటే
నా ఫ్రెండ్ ఉన్నాడు కదా తను అన్నాడు చాలా హాట్ టెంప్టింగ్ ఉన్న అని
అతడు : ఎవరు
అతను , నాకు ఒక్కడికే పంపావ్ అనుకున్న అందరికీ పంపావా
ఆమె : హా మేము
ఫ్రెండ్స్ ఊరికే అలా ఫ్లర్ట్ చేసుకుంటాం
అతడు : అలా
చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా ఫీలింగ్స్ వస్తే
ఆమె : అలా ఎందుకు
వస్తాయి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు నువ్వు ఉన్నావ్
అతడు : అది
తప్పు కదా
ఆమె : ఎం తప్పు
(రెండు నిమిషాలు ఆగు)
5 నిమిషాల తర్వాత
ఆమె : తప్పు
నేను తప్పులే చేస్తాను ఇప్పుడైతే ఫ్రెండ్స్ అందరితో ఫ్లీర్ట్ చేసుకుంటా అయితే ఏంటి
అతడు : అసలు
నేను ఏం అన్న ఏమైంది ఇప్పుడు
ఆమె : నేను
మళ్ళా చేస్తా బాయ్
అది జరగదు 4:
ఆమె : రేపు
ఉదయం స్టార్ట్ అవుతాం
అతడు : మీరు
రైల్వేస్టేషన్ కి వెళ్ళడానికి ఎంత టైం
ఆమె : మా ఊరిలో
కాదు ట్రైన్, 2 గంటలు బస్సులో వెళ్ళాలి కదా
అతడు : పోనీ
బస్సులో అన్న నేను వస్తాను
ఆమె : ఈ రెండు
గంటల కోసం నువ్వు 8 గంటలు ట్రావెల్ చేసి వస్తావా
అతడు : వస్తాను
ఆమె : ఏం అవసరం
లేదు
అతడు : మొత్తానికి
చూడను అంటావ్
ఆమె : చూస్తాలే
అబ్బా
అతడు : ఆ రాహుల్
తో ఎందుకు నీకు బ్లాక్ చేయొచ్చు కదా
ఆమె : నేను
అలా ఎవరినీ బ్లాక్ చేయలేను పైగా అది అతని మిస్టేక్ కాదు ఎవరో చెడుగా చెప్పారు మన కోసం
అతడు : నన్ను
బ్లాక్ చేసావ్ నాతో ఉన్న ట్యాగ్స్ పోయాయి అయినా నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా
దూరం పోతావ్ ఏంటి పాపా ఇది
ఆమె : నేను
అంతే నువ్వు ఉంటే ఉండు లేదంటే లేదు ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు ఇష్టం ఉండదు నీ దగ్గర ఉండకుంటే
ఎలా
అతడు : నా దగ్గర
నీ ఇష్టం అయినట్టే ఉండు కానీ నా ఇష్టాలకి వాల్యూ ఉండాలి కదా
ఆమె : ఉండదు
ఏంటి ఇప్పుడు నాకు తోచినట్టు ఉంటుంది నాకు ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయి నాకు ఇంకా
అతడు : అసలు
ఏంటి నాకు ఇది బాయ్
అది జరగదు 5:
ఆమె: ఏం చేస్తున్నావ్
అతడు: ఏం లేదు
ఆమె: బిజీ నా
అతడు: లేదు
లే చెప్పు
ఆమె: కలిసావ్
గా హ్యాపీ నా
అతడు: నేను
చాలా నువ్వు హ్యాపీనా
ఆమె: నేను కలిసిన
లేకున్నా హ్యాపీ గానే ఉంటాను కదా
అతడు: అంటే
ఆమె: నువ్వే
కలవడం కలవడం లేదు అని ఓ కలవరించావ్ కదా.
అతడు: అంటే
నీకు ఇష్టం లేదా
ఆమె: ఏంటి ఇప్పుడు
గొడవ చేస్తావా
అతడు: నువ్వు
హ్యాపీ నా అంటే నేను ఇచ్చిన ఆన్సర్ కి నీ ఆన్సర్ కి తేడా చూడు ఎవరు గొడవ పడుతున్నారో
అర్థం అవుతుంది, సరే నేను హ్యాపీ కాదు నాతో పిక్స్ దిగలేదు కదా
ఆమె: నాకు ఎవరితో
పిక్ దిగడం ఇష్టం ఉండదు అబ్బా, నువ్వు ఏమో పిక్ దిగి స్టేటస్ పెడతావ్ మళ్ళా ఎవరైనా
చూస్తే
అతడు: ఎవరు
రాహుల్ చూస్తే ఏంటి అన
ఆమె: ఎవరు చూడద్దు
ఆయనే కూడా చూడద్దు సోషల్ మీడియాలో వద్దు
అతడు: ఆహా ఆయన
, నువ్వు
మాత్రం ఆయనతో పిక్ దిగి స్టేటస్ పెట్టుకుంటావ్
ఆమె: ఇప్పుడు
మాట్లాడతావా గొడవ పడతావా
అతడు: నువ్వు
చేసే పనులు నన్ను ఎంత హర్ట్ చేస్తున్నాయో నీకు తెలుస్తోందా, బాయ్
అది జరగదు 6:
ఆమె: హలో నీకు
ఒకటి చెప్పాలి
అతడు: ఏంటి
మేడమ్ ?
ఆమె: I
love you
అతడు: ఇంకా
ఆమె: I
miss you
అతడు: ఇంకా
ఆమె: ఇంకా ఏంటి
రా పంది, రిప్లై ఇవ్వవా
అతడు: I
love you too , miss you too
ఆమె: సరే నేను
మళ్ళా చేస్తాను
అతడు: ఏమైంది
4 రోజుల తర్వాత
అతడు: హలో బేబీ
ఆమె: నేను బేబీ
అని చాలా మందిని పిలుస్తా అయినా బేబీ ఏంటి బేబీ
అతడు: పోనీ
డార్లింగ్
ఆమె: నాకో పేరు
ఉంది ఈ పేరు అన్ని ఏంటి
అతడు: సరే ఇప్పుడు
ఏమంటావ్ నాకు నచ్చినట్టు నేను పిలవకూడదు, నువ్వు మాత్రం నీకు నచ్చినప్పుడు పిలుస్తావా
ఆమె: అంతే కదా
చెప్పింది ఊరికే బేబీ డార్లింగ్ డియర్ నాకు నచ్చవ్
అతడు: ఏంటి నాకు ఈ టార్చర్
ఆమె: నేను నీకు
టార్చర్
అతడు: పాపా
చాలా కోపం వస్తుంది నాకు ఇలా ఐతే రిలేషన్ లో ఉండలేను నేను
ఆమె: ఇప్పుడు
ఉండమని ఎవడు అన్నాడు దె.
అతడు: 🙄🙄
అది జరగదు 7:
ఆమె: హలో సార్
ఏం చేస్తున్నారు
అతడు: హలో చెప్పు
ఆమె: చెప్పు
ఏంటి చెప్పు
అతడు: డార్లింగ్
బేబీ అని పిలవకూడదు కదా
ఆమె: పిలు బాబు
పిలు నీ ఇష్టం వచ్చినట్టు పిలిచి చావు సరేనా నా ఫీలింగ్స్ కి వాల్యూ లేదు ఎక్కడ
అతడు: నీ ఫీలింగ్
ఆ మరి నా ఫీలింగ్స్ ?
ఆమె: అబ్బా
పిలవమన్నా కదా ఇంకేంటి చెప్పు
అతడు: అంత చిరాకు
ఏంటి బంగారం
ఆమె: ఏం లేదు
లే చెప్పు
అతడు: I
love you darling
ఆమె: సరే
అతడు: నేను
లవ్ యు చెప్పా
ఆమె: ఇప్పుడు
ఏంటి నువ్వు చెప్తే నేను చెప్పాలా
అతడు: అసలు
ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావ్
ఆమె: నువ్వు
చెప్పినట్టు నేను చేయాలి లేకుంటే గొడవే
అతడు: మొన్న
నువ్వే కదా చెప్పావు చెప్తే చెప్పాలి అని
ఆమె: అది ఏదో
ఒకసారి అసలే చిరాకు లో ఉన్న ఇంకా చిరాకు తెప్పించకు
అతడు: నిన్ను
ముద్దుగా పిలిస్తే చిరాకు, లవ్ యు చెప్తే చిరాకు నేను ఎందుకు ఉన్నట్టు అసలు
ఆమె: అవును
చిరాకు ఏంటి ఇప్పుడు నేను ఇంతే
అతడు: టెక్
కేర్
అది జరగదు 8:
ఆమె: హలో సార్
ఏం చేస్తున్నారు
అతడు: ఏం లేదు
చెప్పు
ఆమె: పర్లేదు
చెప్పు రా
అతడు: ఆఫీస్
వర్క్
ఆమె: బిజీ ఆ
డిస్టర్బ్ చేశానా మాట్లాడచ్చ
అతడు: చెప్పు
ఆమె: ఎందుకంతే
చిరాకు
అతడు: నీకు
తెలిదా లాస్ట్ టైం ఏం చేశావో
అతడు: అబ్బా
వదిలేయ్ కదా సారీ
అతడు: ఎందుకు
అలా చేశావ్
ఆమె: ఏమో అప్పుడు
అలా చేశా వదిలేయ్ సారీ
అతడు: సరే నేను
మీ ఊరు వస్తున్నా నెక్స్ట్ వీక్
అతడు: కుదిరితే
కలుస్తా
ఆమె: కుదిరితే
కలుస్తా
అతడు: కుదిరితే
కలుస్తావ్ నేను నీకోసం వస్తుంటే వద్దులే నేను టెంపుల్ వెళ్లి వెళ్లిపోతా దేవుడ్ని చూసి
ఆమె: అబ్బా
సరే కలుస్తా
అతడు: వద్దు
మేడమ్ మీ రాహుల్ వచ్చాడు కదా లాస్ట్ వీక్ పిక్స్ దిగి పోస్ట్ చేశారు కదా నాతో మాత్రం
దిగరు
ఆమె: అబ్బా
అది వేరే అబ్బా అతను నువ్వు ఒకటా
అతడు: ఒకటి
కాదు అనే కదా చెప్తున్నా
అతడు: ఈసారి
నేను నీతో పిక్స్ దిగడమే కాదు చాలా పిక్స్ తీస్తా సరేనా నేను పంపిన షర్ట్ బాగుందా
అతడు: సూపర్
ఆ కలర్ నాకు లేదు నిజానికి నచ్చదు కానీ నువ్వు పంపాక ఏంటో భలే నచ్చేసింది.
ఆమె: నీ కోసం
నేను ఒక చైన్ తీసుకున్నా ఆరోజు ఇస్తా
అతడు: నేను
రింగ్స్ ఇంకా నువ్వు మొన్న నచ్చింది అనే లింక్ పంపిన సారీ తీసుకున్న
ఆమె: ఈ హాగ్
నీకోసం
అతడు: కిస్
కూడా ఇవ్వు
ఆమె: నాకు ఇవ్వాలని
లేదు
అతడు: ఏమైంది
మళ్ళా
ఆమె: అబ్బా
గొడవ మొదలు పెట్టకు, ఉమ్మ
అతడు: ఓకే బాయ్
మరి
అతడు: టేక్
కేర్
అది జరగదు 9:
అతడు : మొత్తానికి
కలిశాం పిక్స్ దిగాం
ఆమె : నేను
వీడియో చేసి నువ్వు ఇచ్చిన రింగ్ స్టేటస్ స్టోరీ కూడా పెట్టాను
అతడు : హా చూసా
లే, నేనే రీడ్ రిసీప్ట్స్ ఆపేశా
ఆమె : ఎందుకు
అలా ఆపుతావ్ ఈసారి ఆపితే మామూలుగా ఉండదు
అతడు : సరే
లైఫ్ లో ఇంకెప్పుడు ఆపను
ఆమె : సరే కానీ
చైన్ నచ్చిందా
అతడు : చాలా
బాగుంది బేబీ
ఆమె : అబ్బా
నువ్వు ఇలా నన్ను బేబీ అంటావ్ నాకు ఎవరితో మాట్లాడినా బేబీ అని వస్తుంది మళ్ళా అది
నాకు నచ్చదు, నువ్వు లేనప్పుడు ఓకే కానీ నువ్వు ఉన్నావ్ కదా ఇప్పుడు
అతడు (కన్నీళ్లు
ఆపుకుంటూ) : సరేలే చైన్ చాలా బాగుంది, చీర నచ్చిందా నీ సెలెక్షన్ ఏ కదా, కలర్ నాది అనుకో
ఆమె : అదే చూస్తున్నా
అది సెట్ అవ్వదు ఏమో నాకు డ్రెస్ కుట్టిస్తా లే
అతడు : ఒకసారి
కట్టుకుని చూపించచ్చు కదా
ఆమె : అబ్బా
సెట్ అవ్వదు అని చెప్పా కదా వదిలేయ్ డ్రెస్ చేసి చూపిస్తా లే
అతడు : ప్రామిస్
ఆమె : ప్రామిస్
రా బాబు
అతడు : ఏమోలే
అప్పుడు దిద్దులు పంపిస్తే మీ చెల్లి పడేసింది అన్నావ్ నీకు నచ్చే అని లింక్ పెట్టి
శారీ అంటే తీసుకున్న ఇలా అయింది
ఆమె : అబ్బా
మళ్ళీ మొదలు పెట్టావా 5 నిమిషాలు కూడా ఉండవా శాంతంగా
అతడు : నేను
ఇచ్చిన సారీ కట్టుకో అన్న అంతే కదా బుజ్జి
ఆమె : నేను
ఏమి అయినా బుజ్జి పాపాన ఉండు ఒకసారి వినయ్ ఏదో మెసేజ్ చేశాడు
అతడు : ఏమైంది
ఆమె : ఇందు
ఎవరు ?
అది జరగదు 10:
అతడు : ఇందు
నా స్నేహితురాలు, 6 నెలల ముందు ప్రొపోజ్ చేసింది
ఆమె : నాకు
చెప్పలేదు
అతడు : చెప్పా
కదా చాలా మంది ప్రొపోజ్ చేశారు రిజెక్ట్ చేశా అని
ఆమె : అబ్బా
అతడు : నువ్వు
అన్ని చెప్తున్నావా నీ ఎక్స్ ❌
పేరు చెప్పావ్ కానీ తనతో ఊరు వెళ్లావ్ అని వేరే ఎవరో చెప్తే తెలిసింది
ఆమె : అవన్నీ
ఎందుకు ఇప్పుడు
అతడు : ఇందు
కోసం ఎందుకు ఇప్పుడు
ఆమె : వినయ్
ని మన ఇద్దరం రిలేషన్ లో ఉన్నామా అని అడిగింది ట
అతడు: ఎందుకు
ఆమెకి ఎవరు చెప్పారు
ఆమె : నువ్వు
కాక ఎవరు చెప్తారు
అతడు : జాగ్రత్త
చెప్తున్న పాపా , చివరిసారి నేను బైట చెప్తున్నా అన్నావ్ రాహుల్ అన్నాడు ఎంత గొడవ అయింది
, నా డిజైను వర్క్ కూడా ఆపేశా
ఆమె : నేనే
కారణం అంటావ్
అతడు : నువ్వు
నీ క్లోస్ ఫ్రెండ్స్ అదే ఆయన రాహుల్ కారణం
ఆమె : ఏంటి
అసలు ఇప్పుడు
అతడు : నేను
డిజైన్ స్టార్ట్ చేసేప్పుడు నువ్వు రాహుల్ దగ్గర వర్క్ చేస్తున్నావ్ నేను అడగకుండానే
వచ్చి వర్క్ చేస్తా అన్నావి , ఛాన్స్ ఇస్తే ఎం చేసావ్ ఆరోజు స్టేటస్ పెట్టుకున్నావ్
మళ్ళా వర్క్ మానేసావ్
ఆమె : ఐతే నా
ఇష్టం కదా
అతడు : మరి
ఎందుకు వచ్చావ్ పైగా రీసన్ ఏంటి నేను ఇక్కడ వర్క్ చేయడం రాహుల్ గారికి ఇష్టం లేదు నేను
చేయమని అడిగానా , మొదలు పెట్టక మానేస్తే నాకు ప్రాబ్లెమ్ కదా
ఆమె : ఏంటి
అసలు ఇప్పుడు
అది జరగదు 11:
అతడు : గొడవ
ఎందుకు అని డిజైన్ మానేశా , షార్ట్ ఫిల్మ్ తీసి వాటిని ప్రచారం చేయమంటే నా ఫ్రెండ్స్
వి చేశా ఇప్పుడు మానేశా అంటావ్
ఆమె : ఏం అడిగిన
ఎప్పుడో విషయాలు తీస్తావ్
అతడు : నీకో
దణ్ణం ఆ ఇందు కి అడిగి తెల్సుకో ఎవరు చెప్పారో మీ రాహుల్ ఎలాగూ చెప్పడు కదా
ఆమె : ఉండు
ఆమెని అడిగా ఎవరో చెప్పారు అని ఆమె పేరు చెప్పింది కానీ ఆమె నంబర్ పని చేయటం లేదు
అతడు : అర్థమైంది
కదా ప్రతిదానికి నా మీద పడిపోవటం నా ద్వారా నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు
ఆమె : ఏమో లే
నా జీవితం అంతే
అతడు : ఇప్పుడు
ఏమైంది బేబీ లవ్ యు
ఆమె : ఏంటి
ఎప్పడు ఏం మాట్లాడాలో తెలీదా
అతడు : ఏంటి
బుజ్జి , లవ్
యు చెప్పు
ఆమె : అబ్బా
లవ్ యు
అతడు : కిస్
ఎవరు పెడతారు అమ్మ
ఆమె : నాకు
చిరాకు గా ఉంది మళ్ళా మాట్లాడతా
అతడు : గొడవ
నువ్వు పెట్టుకున్న క్లారిఫై అయింది నేను కదా చిరాకు పడాలి నీకు ఏమైంది అసలు
ఆమె : ఏదో ఒకటి
నన్ను కాసేపు వదిలేయ్
అతడు : ఎందుకో
అది జరగదు 12:
ఆమె : మళ్ళా
చేస్తా అని చెప్పా కదా ఇంత చిన్న దానికి కాల్స్ మెసేజ్ , అ స్టేటస్ ఏంటి పిచ్చి పట్టినట్టు
అతడు : అవును
లవ్ చేశా కదా పిచ్చి నాకు
ఆమె : ఏంటి
నేను చేయలేదా నువ్వే చేసినట్టు
అతడు : అలా
బిహేవ్ చేస్తున్నావా , ఎప్పడు ఎవరో ఒకరి కోసం నాతో గొడవ అసలు ఏంటి ఇది
ఆమె : నేను
ఎవరికి సపోర్ట్ చేయడం లేదు
అతడు : కానీ
నాకు కూడా చేయడం లేదు , అందరికీ సపోర్ట్ మానమని నేను అనలేదు నాకు కూడా చేయు అన్న
ఆమె : నీకు
చేయడం కుదరదు అలాగే నీకు చేయను కాబట్టి ఎవరికి చేయను
అతడు : ఎవరికి
చేయకున్న నాకు చేయు
ఆమె : అది అవ్వదు
అతడు : సరే
బాయ్
అతని నంబర్
బ్లాక్
3 నెలల తర్వాత
ఆమె : హలో
అతడు : చెప్పు
ఆమె : పిచ్చి
పట్టిందా నీకు ఇన్స్టా లో ఆ లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ లు ఏంటి
అతడు : నీలా
నేను ఉండలేను కదా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ
ఆమె : అవన మాట్లాడితే
లాయల్ లేనట్టా
అతడు : నేను
అలా అనలేదు
ఆమె : సరే మళ్ళా
చేస్తాను
అది జరగదు 13:
అతడు: హలో
ఆమె : చెప్పు
రా
అతడు : కాల్
ఎత్తావు చేయగానే సూపర్
ఆమె : హాహా
అతడు : నెక్స్ట్
మంత్ మీ ఊరు ట్రిప్ వస్తున్న , ఒక 4 డేస్ ఉంటాఆమె : అన్ని రోజులు నేను కలవలేను ఒకరోజు
కలవడానికి ట్రై చేస్తా
అతడు : సరే
నీకు ఇష్టం అని పూతరేకులు తెస్తున్నా
ఆమె : సరే
వారం తర్వాత
అతడు : టెంపుల్
కి వస్తున్న రేపు
ఆమె : నా హెల్త్
అంత బాగాలేదు
అతడు : రేపు
కలుస్తావా
ఆమె : హా కలుస్తా
తర్వాత రోజు
ఆమె : ఇదుగో
నీ చాక్లెట్
అతడు : ఇవిగో
నీ పూతరేకులు
కాసేపు మాటలు
అయ్యాక.
ఆమె : నీకోసం
ఫుడ్ తెచ్చాను
అతడు : తినిపించూ
కదా
ఆమె : హమ్మో
ఎవరైనా చూస్తారు
అతడు : సరే
నీకు పెడతా కొంచెం
ఆమె : సరే ఫాస్ట్
ఆమె : ఇంకా
వెళ్తా లేట్ అవుతోంది
అతడు : అబ్బా
సరే
ఆమె ; నీ షార్ట్
ఫిల్మ్ కి ప్రమోషన్ ఆడియో చేశా పోస్ట్ చేయాలా
అతడు : నేను
అడగకుండానే సూపర్ చేయు
ఆమె : వెనక
ఎందుకు వస్తున్నావ్
అతడు : నిన్ను
వెనక నుంచి చూద్దాం అని
ఆమె : సరే వెళ్ళు
ఇంకా బాయ్
అతడు : బాయ్
అది జరగదు 14:
మరుసటి రోజు
ఉదయం ఫోన్ కాల్ లో
ఆమె : హలో
అతడు : చెప్పు
మా
ఆమె : నేనొటి
అడగనా నిన్ను
అతడు : ఏంటి
పెర్మిషన్స్ కూడా తీసుకుంటున్నవ ఈ మధ్య
ఆమె : అది కాదు
మొన్న నీ షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్ ఆడియో చేశా కదా
అతడు : హ
ఆమె : ఒక ఆడియో
ఛాన్స్ వచ్చేలా ఉంది నీ డైలాగ్స్ వాడి పంపన
అతడు : హా సరే
ఆమె : థాంక్స్
రా మల్ల చేస్తాను
అతడు : సరే
ఆ తర్వాత రోజు
అతడు : నేను
ఇవాళ వెళ్లిపోతున్నా ఏమైనా కలిసే వీలు ఉందా
ఆమె : కుదరదు
రా నువ్వు వెళ్లేప్పుడు నేను కాల్ చేసి మాట్లాడతా ఇప్పుడు బిజీ ఉన్న
అతడు : నీ మీద
కవిత రాసి పోస్ట్ చేసా చూసావా బాగుందా
ఆమె : హ గుడ్
అతడు : నిన్ను
టాగ్ చేసి పెట్టాలా
ఆమె : నో రా
అతడు : పోనీ
నువ్వు షేర్ చెయ్ కదా
ఆమె : నేను
చేయలేను, నేను ఇప్పుడు ఎవరివి చేయడం లేదు, నీవి కూడా చేయను
అతడు : (మనసులో
ఏడుస్తూ అంత నేను ఒకటేనా ) సరే ఉంటాను
ఆమె : హా బాయ్
ఈవెనింగ్ చెస్తాను
అతడు : ఓకే
కాసేపటి అతనికి
ఫ్రెండ్ నుంచి కాల్, ఆమె వాట్సాప్ లో పెట్టిన రీల్ చాలా బాగుంది అని కానీ అతనికి కనపడలేదు.
అది జరగదు 15:
అతడు : హలో
ఆమె : చెప్పు
అతడు : కాల్
చెస్తా అన్నావు చేయలేదు
ఆమె : నేను
చేస్తాను అన్నానా మర్చిపోయి ఉంటాలే
అతడు : అవును
లే అన్ని మర్చిపోతావ్, కలవడానికి రమ్మంటే బిజీ, నేను కవిత రాసింది పోస్ట్ చేయమంటే బిజీ
ఆమె : అవును
నిజంగానే బిజీ ఉన్న
అతడు : ఇందులో
బిజీ ఉన్నావ్, వేరే వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిమ్స్ రీల్స్ ప్రమోట్ చేయడం లోన
ఆమె : ఎం మాట్లాడుతున్నావ్
అతడు : నిజం
నాకు చేయమంటే చేయవు మల్ల నీ ఫ్రెండ్స్ రాహుల్ ఎవరు చూడకూడదు, వేరే వాళ్ళకి చేస్తావ్
పైగా నన్ను స్టేటస్ నుంచి తీసేసి మరి
ఆమె : ఏంటి నీ ప్రాబ్లెమ్
అతడు : నీ ప్రాబ్లెమ్
ఏంటి?
ఆమె : నాకు
నచ్చింది నన్ను చేనివ్వవు నువ్వు అదే ప్రాబ్లెమ్ అందుకే స్టేటస్ నుంచి నిన్ను తీసేసా
అతడు : అసలు
అదేంటి నాకు అర్థం కాదు, నేను వేరే వాళ్ళని ప్రమోట్ చేయిద్దు అనలేదు, నీకు నచ్చిన పని
మనమని అనలేదు, నాకు కూడా సపోర్ట్ ఇవ్వి అన్న దానికి ఎందుకు ఇంత చేస్తున్నావ్
ఆమె : నాకు
ఆలా ఇష్టం లేదు
అతడు : అంటే
నాకు సపోర్ట్ ఇస్తున్నావ్ అని బైట ఎవరుకు తెలియకూడదు అంతేనా
కాల్ కట్, బిజీ
బిజీ
3 నెలల తర్వాత
అది జరగదు 16:
అతనికి ఆరోగ్యం
కొంచెం పాడు అయింది, ఆరోజు డాక్టర్స్ 48 గంటలు గడిస్తే కానీ ఎం చెప్పాలేము అన్నారు
అతడు కాల్ చేసాడు
ఆమెకి బ్లాక్ లోనే ఉంది, మెసేజ్ చేసాడు, ప్రొఫైల్ లింక్ కాపీ చేసి ఇన్స్టా చూసాడు,
ఆరోజు పోస్ట్స్ స్టోరీస్ కనిపించాయి. ఆరోజు చనిపోతే బాగున్ను అనుకున్న బ్రతికేసాడు
అతడు ఆరోజు
డిసైడ్ అయ్యాడు ఇక ఈ బందంలో మనం ఉండలేము అని
ఇంకో 3 నెలల
తర్వాత కాల్ వచ్చింది
ఆమె : హాయ్
ఎలా ఉన్నావ్
అతడు : బ్రతికే
ఉన్న నువ్వు
ఆమె : ఎదో ఉన్న,
ఇంట్లో ఫోన్ ఇవ్వడం లేదు సరిగా
అతడు : ఓహో
ఇవ్వకుండానే ఇంస్టాగ్రామ్ లో స్టోరీస్, కొత్త షారర్ ఫిలిమ్స్ కి ఎడిటింగ్ అన్ని చేస్తున్నావా
సూపర్
ఆమె : వాళ్ళు
పక్కన కూర్చుని చేయిస్తున్నారు రా
అతడు : సరే
ఏంటో చెప్పు
ఆమె : నేను
మీ ఊరు వస్తున్నా ఇప్పుడు
అతడు : సరే
నేను వేరే ఊరు వచ్చాను ఏంటి విషయం
ఆమె : అదే షార్ట్
ఫిల్మ్ ఎడిటింగ్ కోసం
అతడు : ఓహో
పంపరా ఇంట్లో
ఆమె : తమ్ముడ్ని
ఇచ్చి
అతడు : సరే
జాగ్రత్త
ఆమె : నువ్వు
కూడా జాగ్రత్త
కొన్ని రోజుల
తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసి అతను కాల్ చేసాడు
అది జరగదు 17:
అతడు : హలో
ఆమె : హాయ్
చెప్పు
అతడు : వాడుతో
నువ్వు వాయిసస్ చేస్తున్నావ్ సరే కానీ వాడు నీ మీద కవిత రాస్తే దానికి నువ్వు
collob అయ్యి పోస్ట్ కూడా పెట్టావ్
ఆమె : ఏముంది
దాంట్లో
అతడు : నేను
కవిత రాస్తే మాత్రం ఇలాంటివి చేయరు మేడం అంతే కదా
ఆమె : అప్పుడు
పరిస్థితి వేరు ఇప్పుడు ఏంటి
అతడు : అది
తీసేయ్ ముందు, నువ్వు ఎవరితో అయినా చేయి వాడితో వద్దు, వాడికి మంచి నేమ్ లేదు
ఆమె : ఏంటి
నీ బాధ అసలు నన్ను కంట్రోల్ చేస్తావ్ ఊరికే
అతడు : నేనా,
నువ్వు నీ ఫ్రెండ్స్తో ఫ్లిర్ట్ చేస్తే ఎప్పుడు ఎం అనలేదు, బేబీ అని పిలుస్తా కాల్స్
మాట్లాడతా అంటే ఎం అనలేదు కనీసం విడుతో వాయి్స్ చేస్తాను అన్న ఎం అనలేదు, నీ షార్ట్
ఫిల్మ్ ఎడిటింగ్ కి ఎం అనలేదు, వీడు మంచివాడు కాదు కవితలు వద్దు నీ మీద అంటే
ఆమె : ఓహో అంటే
నేను వర్క్ చేస్తే ప్రాబ్లెమ్ కదా నీకు అసలు నీ లాంటి వాడ్ని లవ్ ఎలా చేశానో నేను ఒక
బంధం లో నేను ఎలా ఉంటాను నువ్వు ఎలా ఉంటావ్
అతడు : అంటే
ఆమె : ఏముంది
నేను అందరితో కొంచెం ఫ్రెండ్లీ ఉంటాను నువ్వు ఏమో ఇదుగో ఇలా చేస్తావ్
అతడు : అసలు
ఎం మాట్లాడుతున్నావ్, నాకు హెల్ప్ చేయవు, నేను చచ్చేలా ఉన్న నీకు పని ఉంటే చేస్తావ్
లేదా లేదు, ఇప్పుడు నీ పరువు పోతుంది అంటే ఇలా అంటావు
ఆమె :ఏంటి ఇప్పుడు
అతడు : అమ్మ
తల్లి ఎప్పుడు అయితే నువ్వు నేను చస్తూ ఉన్న మాటలు ఆపేసావో అప్పుడే నేను నువ్వు మళ్ళా
కాల్ చేసిన ఫ్రెండ్స్ అనే అనుకున్న అలాగే ఉన్న కూడా, ఇప్పుడు కూడా వాడి వాళ్ళ నువ్వు
బాడ్ అవుతావు అని చెప్పా అంతే, నేను ఈ బంధం నుంచి పూర్తిగా బైటకి వెళ్తున్న
అది జరగదు 18:
ఆమె : నేను
ఆలా ఒకరికి మాట ఇచ్చి మానేయలేను, అతను ఆన్లైన్లో లో లేరు వచ్చాక చెప్పి తీసేస్తా
అతడు : అతను
తో ఎం పని ఉంది నీ పోస్ట్ తీయడానికి
ఆమె : చెప్పాలి
కదా
అతడు : మావి
అయితే తీసేస్తారు కాల్ చేయ్
ఆమె : అసలు
ఏంటి ఏ టార్చెర్ నాకు
అతడు : నీకు
నమస్కారం , నాకు నచ్చింది కవాల్సింది అడిగింది ఏది చేయవు అది చీర అయినా కమ్మలు అయినా
ముద్దు పేరు అయినా ప్రైమోషన్ అయినా , పోనీ వీడు బాడ్ వద్దు అంటే వాడితో నీ మీద కవితలు
రాయించుకుంటావ్ టాగ్స్ చేస్తావ్ .
I’m done
with and blocking you every where, i don't want this much toxic relation at
all.
ఆమె : అందరు నన్ను వాడుకునే వాళ్ళు నేను ఎవరికీ అక్కర్లేదు
అతడు : ఎం వాడుకున్న
నిన్ను నేను , నాతో ఏమైనా పడుకున్నవ, రింగ్
పెట్టినపుడు చేతిని తాకడం తప్ప కనీసం ఒక ముద్దు
హాగ్ కూడా ఇవ్వలేదు నాకు , పోనీ ఏమైనా మనీ ఇచ్చావా , పోనీ నాకు అవసరం అయినపుడు ఎప్పుడైనా
ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చావ, ఏడ్చేవాడిని ఏడిపిస్తావు, హాస్పిటల్ లో ఉండి కాల్ చేస్తే నో
రిప్లై పోనీ నో రిటర్న్ కాల్.
నిన్ను ఎవరు
ఎలా వాడుకుకున్నారో నాకు తెలీదు కానీ నేను ఎం వాడుకోలేదు
ఆమె : నీకోసం
నేను చైన్ కొన్న ఎవరికోసం అంత డబ్బు పెట్టలేదు
అతడు : చైన్
ఇవ్వాళ
ఆమె : వద్దు
ఉంచుకో నీ దగ్గరే
అతడు : బాయ్
ఇంకా నిన్ను కలవను.
అది జరగదు 19:
ఆమె : ఒరేయ్
నేను నీ పక్కన ఉంటే అసలు ఎలా ఉండేదాన్ని ఎలా చూసుకునేది అనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు
ఇది నేను అని చూపించలేను, చెప్పిన నీకు అర్థం కాదు
అతడు : చూపించింది
చాలు ఆకలి వేసినపుడు అన్నం పెట్టాలి దాహం వేసినపుడు నీళ్లు ఇవ్వాలి
ఆమె : సరే నీ
ఇష్టం నేను సెట్ కాను అన్నావ్ కదా
అతడు : నువ్వే
ముందు అన్నావ్ నీ లాంటి వాడిని ఎలా ప్రేమించాన, అందరితో నార్మల్ ఉండే నీలాంటి అమ్మాయి
నాలాంటి వాడిని ప్రేమించకూడదు అని అసలు నేను ఎప్పుడు రెస్ట్రిక్ చేసానో నాకే తెలీదు
(ఏడుస్తూ )
ఆమె : ఏమంటావ్
ఇప్పుడు
అతడు : జాగ్రత్త
నేను ఇంకా రాను నీకు వచ్చే అవకాశం ఇవ్వను
ఆమె : hmm
కొన్ని నెలల
తర్వాత ఆమె పోస్ట్ చాలా బాధాకరం ఉన్నాయి ఏమైనా ప్రాబ్లెమ్ లో ఉందా లేదా ఇంకా ఏమైనా
ఇబ్బంది వచ్చిందా అసలు ఈమె కి అనుకున్నాడు అతడు
అతడు (మనసులో
) : ఫోన్ చేద్దామా, ఎందుకు అంటే అనుకోకుండా వచ్చింది అని చెపుదాం
ఆమె : హలో
అతడు : ఎలా
ఉన్నావు కాల్ అనుకోకుండా వచ్చింది
ఆమె : జీవితం
లో కష్టాలు తట్టుకోలేను చాలా బాధగా ఉంది
అతడు : ఏమైంది
ఆమె :దేనికి
ఇంట్లో సపోర్ట్ లేదు నా కలలు అన్ని కల్లలు అయ్యేట్టు ఉన్నాయ్
అతడు : ఎం కాదు
అన్ని సెట్ అవుతాయి
ఆమె : నిన్ను
ఒకటి అడగనా
అతడు : హా
అది జరగదు 20:
ఆమె : నన్ను
పెళ్లి చేసుకుంటావా ఈ బాధలు అన్ని భరించలేక నీ దగ్గరికే వద్దాం అనుకున్న
అతడు : అవునా
కానీ నాకు ఆ ఉద్దేశం లేదు ఇప్పుడు, మనం చాలా కాలం నుంచి ప్రేమికుల ల లేము, మనం స్నేహితుల
ల ఉందాం
ఆమె : సరే
అతడు మనసులో
ఈమె ఏమైనా మారిందా చూడాలి
తర్వాత కొన్ని
రోజులు ఎలా ఉన్నారు రోజు ఎలా గడిచింది అని మాటలు సాగయి.
ఒకరోజు
అతడు : నువ్వు
నాకోసం ఒక పని చేయాలి వాట్సాప్ లో బ్లూ టిక్స్ ఇంకా డీపీ ఎప్పుడు తీసేయద్దు
ఆమె : ఏంటి
అతడు : ఒక నెంబర్
కైనా ఉంచు, నువ్వు బ్లాక్ చేసావో చూసావా లేదా తెలీడం లేదు
ఆమె : సరే
ఒక రోజు తర్వాత
అతడు : మళ్ళా
బ్లూ మార్క్స్ తీసేసావ్
ఆమె : నాకు
పెట్టుకోవాలని లేదు ఏంటి ఇప్పుడు
అతడు : సరే
మరుసటి రోజు
అతడు మెసేజ్
సింగల్ టిక్స్, డీపీ లేదు రెండు గంటలు చూసాడు ఇంకా కాల్ చేసాడు అతను
ఆమె : హలో
అతడు : పిచ్చ
నీకు మళ్ళా బ్లాక్ చేసావ్
ఆమె : నాకు
డీపీ ఉంచడం నచ్చలేదు తీసేసా, నెట్ ఆఫ్ చేశా
అతడు : మెసేజ్
అన్న చేయిచ్చు కదా టెన్షన్ పడతా కదా
ఆమె : మర్చిపోయాను
అతడు : ఇలా
అయితే ఎలా
ఆమె : ఎలా ఇంటి
మన మధ్య స్నేహం తప్ప ఎం లేదు కదా ఎందుకు ఇంక ఇవన్నీ
అతడు : స్నేహం
ముందుకు వెళ్ళాలి అంటే ముందు నువ్వు మారాలి, స్నేహం లోనీ నేను నచ్చి ప్రేమించిన అమ్మాయివి
నువ్వు
కానీ నువ్వు
ఎప్పటికి మారవు వాడికి నచ్చింది చేయాలి అని ఉండదు కనీసం వాడు ఎం ఇష్టపడతాడు ఎం కట్టుకుందాం
ఎం ఉండదు
అందుకే స్నేహం
చాలు అనుకున్న, ఎందుకు అంటే నాకోసం ఏదయినా అని అడిగితె ఎందుకు చేయాలి నాకు నచ్చింది
చేస్తాను అంటావ్
నీకు నచ్చింది
చేయడం అంటే మంచి చదువు జాబ్ ఇంకా నచ్చిన పెళ్లి ఇంకా ఏదయినా అంతే కానీ మనం ప్రేమించిన
వాళ్ళు ఒక డ్రెస్ వేసుకో అంటే నా ఇష్టం శారీ లో చూడాలి అని ఉంటే నా ఇష్టం ఇద్దరం బైటకి
వెళ్దాం అంటే నా ఇష్టం ఇది కాదు, మంచి చెప్తే నా ఇష్టం, హెల్ప్ చేయడం అంటే నా ఇష్టం
ఇది కాదు, ఎవరి కోసమో మన అనుకున్న వాళ్ళని పక్కన పెట్టడం కాదు
ఆమె : చూడు
చిన్న డీపీ కోసం ఎంత రామాయణం చేస్తున్నవో
అతడు : చిన్నదే
కదా నాకోసం చేయిచ్చు కదా ఎం లేకుంటే బ్లాక్ అని అనుకుంట అని ముందే చెప్పా కదా
ఆమె : అది నా
ఇష్టం కదా
అతడు
: అన్ని ని ఇష్టం మాకు ఇష్టాలు ఉండవు మేము
రోబో కదా నీకు నచ్చింది చేస్కో బాయ్
ఆమె : అవును
నేను ఇంతే నీకు సరి కాదు నేను జాగ్రత్త.
అందరికి -మీరు
ప్రేమిచిన వాళ్ళు మీరు అడిగిన ప్రతిదీ భారం ల ఫీల్ అవుతూ ఉంటే దయ చేసి అందులోంచి బైటకి
వచ్చేయండి లేదంటే మనకి ఫీలింగ్స్ ఉన్నాయ్ అని మర్చిపోతాం,
ప్రేమ పెళ్లి
ఏ బంధం అయినా ఇద్దరు ఒకరికి నచ్చిన పని ఇంకోరు కొన్ని సార్లు చేస్తూ ఉంటే ఆనందం ఉంటుంది.
అది ఒక చొక్కా అయినా శారీ అయినా.
-------------అయిపోయింది
---------------------------------------
-- నేను రాసిన
ఈ కథ చదివిన అందరికి ధన్యవాదములు. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి